![]() |
![]() |
.webp)
బుల్లితెర తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుని, అలరిస్తున్న టాప్ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. ఇక పండగలు, స్పెషల్ డేస్ లో ప్రసారమయ్యే ఈ షోను మరింత అందంగా ముస్తాబు చేసి రెడీ చేశారు మేకర్స్.
ఇక ఇప్పుడు ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో హైపర్ ఆది ఓ సెన్సేషనల్ కామెంట్ చేశాడు. తాను జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం కొత్త యాంకర్ సౌమ్యరావు అంటూ స్టేజి మీద అందరి ముందు చెప్పేసాడు. దీంతో అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు ప్రత్యేక ఈవెంట్స్ లో తన పంచ్ డైలాగ్స్ తో అదరగొడుతూ ఉంటాడు ఆది. ఐతే ఈ మధ్య కొంత కాలం నుంచి జబర్దస్త్ లో ఆది కనిపించడం లేదు. దానికి కారణం ఆమె అంటూ అందరి ముందు అసలు విషయం బయట పెట్టాడు. తాను జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ ప్రోమోలో తెలిపాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ 15 వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్ “సంక్రాంతి శుభాకాంక్షలు” పేరుతో రాబోతోంది. ఇందులో రాకెట్ రాఘవ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. ఈ షోలో ఆది పెదరాయుడు గెటప్ లో కనిపించి కడుపుబ్బా నవ్వించాడు. మధ్యలో రష్మి.. హైపర్ ఆదిని కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగింది. వాటికి ఆది కూడా కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు.
![]() |
![]() |